బీజేపీకి ఆరెస్సెస్‌ మాజీల షాక్‌

బీజేపీకి ఆరెస్సెస్‌ మాజీల షాక్‌

భోపాల్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి రాష్ట్రీయ స్వయం సేవక్(ఆరెస్సె్స)కు చెందిన మాజీ నేతలు షాకిచ్చారు. ఆ పార్టీతో పాటు కాంగ్రె్సను ఎదుర్కొనేందుకు గాను జనహిత పేరుతో కొత్తపార్టీని స్థాపించారు. 2007లో ఆరెస్సె స్ను వీడిన అభయ్ జైన్, మనీశ్ కాలే, విశాల్ బాదల్ ముగ్గురూ జనహిత వ్యవస్థాపకులు.సుమారు 200మంది నేతలతో కలిసి తమ తొలి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని శివరాజ్ సర్కారును ప్రజాసమస్యలపై నిలదీస్తామని ప్రకటించారు. దేశంలో బీజేపీ లేదా కాంగ్రెస్ అన్న ద్విదాధిపత్య విధానాన్ని అడ్డుకుని, ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనహిత ఇంకా రాజకీయ పార్టీగా నమోదు కాలేదు. అయితే, ఆ విధానాన్ని ఇప్పటికే ప్రారంభించామని, త్వరలోనే లాంఛనాలు పూర్తికానున్నాయని నేతలు వివరించారు. బీజేపీ అనుబంధ ఆర్ఎ్సఎ్సకు చెందిన ఒకప్పటి నేతలు ఇప్పుడు ఆ పార్టీపైనే పోటీకి దిగడం, బీజేపీకి ఎదురుదెబ్బ అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రజల్లో బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకతకు ఆరెస్సె్స మాజీ నేతలు ప్రత్యేక పార్టీ పెట్టడమే నిదర్శనమని కాంగ్రెస్ నేత పీయూష్ బాబెలే పేర్కొన్నారు. బీజేపీ నేతల అవినీతి పట్ల ఆ పార్టీ అనుబంధ సంస్థలు కూడా విసిగిపోయాయన్నారు. జనహిత ప్రభావాన్ని బీజేపీ తోసిపుచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎవరి సిద్ధాంతాలకు తగ్గట్టు వారు అనుసరించుకోవడంలో తప్పేం లేదని, తమ పని తాము చేసుకుంటూ వెళ్తామని బీజేపీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos