వీడిన ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ గుట్టు!

  • In Film
  • October 6, 2019
  • 831 Views
వీడిన ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ గుట్టు!

బాహుబలి అనంతరం తారక్,చరణ్ వంటి భారీ మాస్హీరోలతో జక్కన్న రాజమౌళి అత్యంత భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై మొదటినుంచి అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి.ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి ఏకొత్త అప్డేట్ లేకపోయినా చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం టైటిల్ గురించి సస్పెన్స్ గురించి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సమాచారం బయటకు పొక్కలేదు.అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ టైటిల్ సస్పెన్స్ వీడినట్లు తెలుస్తోంది. చిత్రానికి ‘రామ రౌద్ర రుషితం’ అన్న టైటిల్ ను రాజమౌళి సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఇక ఇతర భాషల కోసం ‘రైజ్ రివోల్ట్ రివెంజ్’ అన్న టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ, త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తాజా సమాచారం