చరిత్ర వక్రీకకరణ

చరిత్ర వక్రీకకరణ

అమరావతి: ఆర్ఆర్ ఆర్ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించారంటూ అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించడం దారుణమ న్నారు. అల్లూరి, కుమురం భీమ్ లు కలి సినట్టు చరిత్రలో లేదని, చరిత్రను వక్రీకరించి చూపించిన ఘట్టాలను తొలగించాలని కోరారు. ఇప్పటికే కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ పోషించగా, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos