20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు

20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు

ముంబై: ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పతన అంచున నిలబడిన వేళ శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శివసేన ఇంకా బలంగానే ఉందన్నారు. రెబ ల్ ఎమ్మెల్యేల్లోని 20 మంది తమతో టచ్లో ఉన్నారని ఆయన వెల్లడించారు. ‘వారంతా ముంబై వస్తే ఎవరు మాతో ఉన్నారో తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేలంతా ఏయే పరి స్థితు లు, ఒత్తిళ్ల మధ్య మమ్మల్ని వీడారో త్వరలోనే చెబుతా’నన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రేకి నిజమైన భక్తులు కాదని మండి పడ్డారు. ఎన్ఫోర్స్మెం ట్ డైరెక్టరేట్ ని బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసి శివసేన ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చిందని రౌత్ ఆరోపించారు. ఈడీకి భయపడి పారిపోయిన ఎమ్మెల్యేలు నిజమైన బాల్థాక్రే అనుచరులు కాదన్నారు. మిగిలినవారమే నిజమైన భక్తులమన్నారు. తమకు కూడా ఈడీ ఒత్తిళ్లు ఉన్నాయి. అయినా శివ సేనను వీడ బోమని చెప్పారు. విధానసభలో బల పరీక్ష ఏర్పాటు చేస్తే ఎవరికి సానుకూలత, ఎవరికి ప్రతికూల అనే విషయాలు తెలుస్తాయని సంజయ్ రౌత్ విశ్వాసం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos