ఎల్జీ మడత పెట్టే టీవీ మార్కెట్లోకి

ఎల్జీ మడత పెట్టే టీవీ మార్కెట్లోకి

న్యూ ఢిల్లీ: 65 అంగుళాల తనకు తాను చుట్టుకునే ఎల్ఈడీ టీవీని ఎల్జి దక్షిణ కొరియాలో విడుదల చేసింది. దీని ధర ధర 87 వేల డాలర్లు-సుమారు రూ.67 లక్షలు. ఆసనంగా ఉండే అల్యూమినియం పెట్టె ఇది పూర్తిగా ముడుచుకుని పోతుంది. తెర పరిమాణం 65 అంగుళాలు. వీక్షకులు తమకు నచ్చిన పరిమాణంలో చూసుకునేలా మార్చుకోవచ్చు. 100 వాట్స్ ఔట్ పుట్ విద్యుత్ తో 3.2 చానెల్ ఔట్ పుట్. సరౌండ్ సౌండ్ అనుభూతిని స్తుంది. బ్లూ టూత్ స్పీకర్, మ్యూజిక్, క్లాక్, ఫ్రేమ్, మూడ్, హోమ్ డ్యాష్ బోర్డ్ పేరిట ఐదు రకాల టీవీలున్నాయి. జియోన్ బుక్ నగరంలోని గుమీలో దీన్ని తయారు చేస్తున్నారు. కొంత పనిని నిపుణులైన కార్మికులు చేత చేయిస్తున్నారు. దీని ఫ్యాబ్రిక్ కవర్ ను డానిష్ టెక్స్ టైల్ సంస్థ క్వాడ్రాట్ తయారు చేసింది. మూడు సంవత్సరాల వారంటీ లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ టీవీ భారత్ లో అందుబాటులో లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos