విజయవాడ: మంత్రి రోజా ఒక అనవసరమైన వివాదంలో చిక్కుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బుడబుక్కల సామాజికవర్గం ఆగ్రహించింది. రోజా వ్యాఖ్యలు తమ కులస్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు మండి పడ్డారు. తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడిన రోజాపై పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట సంఘం నేతలు కాసేపు ఆందోళన చేశారు. తక్షణమే తమకు రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.