సోనియా గాంధీ అల్లుడికి అస్వస్థత..

సోనియా గాంధీ అల్లుడికి అస్వస్థత..

కాంగ్రెస్ మహిళా నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా అస్వస్థతకు గురయ్యారు.వెన్నునొప్పి తీవ్రతరం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే వాద్రాను నోయిడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాద్రాతో పాటు ప్రియాంక గాంధీ సైతం రాత్రంతా ఆసుపత్రిలోనే గడిపారు.వాద్రా ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు ఇంతవరకూ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos