దళితుల రాకపోకలకు ఆటంకాలు

హొసూరు : ఇక్కడికి సమీపంలోని ఓ గ్రామంలో దళితులకు దారి అడ్డగించడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సత్యమంగలం గ్రామంలో సుమారు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి. 50కి పైగా దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి. గత ఏడాది గ్రామంలో దళితులు, అగ్ర వర్ణాల మధ్య మనస్పర్థలు ఏర్పడి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారం పోలీసు స్టేషన్ దాకా వెళ్లింది. ఇరు వర్గాలపై కేసులు నమోదు కావడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం అగ్ర వర్ణాల వారు తమ భూములలో తిరగరాదని రోడ్లను అడ్డగించి అగ్ర వర్ణాల వారు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు గ్రామంలో పలు చోట్ల దారులకు అడ్డంగా రాళ్లు పెట్టడం, చెట్లను నరికి దారికి అడ్డంగా వేయడం, కాలువలు తవ్విన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. అగ్ర వర్ణాలకు చెందిన కొందరు రోడ్లను అడ్డగించి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సంబంధిత అధికారులకు దీనిపై ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని వారు ఆరోపించారు. వెంటనే అధికారులు చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

తాజా సమాచారం