రివర్స్‌ టెండరింగ్‌ ఆదా రూ.ఐదు వేల కోట్లు

రివర్స్‌ టెండరింగ్‌ ఆదా రూ.ఐదు వేల కోట్లు

అమరావతి:సాగునీటి పథకాల రివర్స్ టెండరింగ్ ఘన విజయాన్ని సాధించిందని నీటి పారుదల శాఖమంత్రి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్లో రూ.61 కోట్లు మిగిలాయి. ఇతర పథకాల రివర్స్ టెండరింగ్లో రూ.1000 కోట్లు ఆదా అయ్యాయి. భవిష్యత్తులో చేపట్టే రివర్స్ టెండరింగ్లో మరొక 500 కోట్లు మిగులుతాయి. మేము రివర్స్ టెండరింగ్ నిర్వహించిక పోతే 1500 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళేవి. ఎక్సస్ టెండర్ల ద్వారా చంద్ర బాబు నాయుడు దోపిడీకి పాల్పడ్డారు. రివర్స్ టెండరింగ్ ద్వారా వందల కోట్ల ప్రజా ధనాన్ని మిగిల్చినందకు అభినందించటానికి బదులుగా ఆయన విమర్శలు చేయడం సిగ్గు చేటు. రివర్స్ టెండింగ్ ద్వారా అన్ని శాఖల్లో రూ.నాలుగు-ఐదు వేల కట్లు మిగులుతాయి. చంద్ర బాబు నాయుడు ప్రజాధనాన్ని పదిమంది కాంట్రాక్టర్లుకు కట్టబెట్టాలని చూస్తే అదే ధనాన్ని పేదలకు ఖర్చు చేయాలని జగన్ చూస్తున్నార’ని పేర్కొన్నారు. ‘చంద్రబాబు ఢిల్లీ వెళ్తే తప్పులేదు. జగన్ ఢిల్లీ వెళ్తే తప్పా..?ని ప్రశ్నించారు. ‘చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు. చంద్ర బాబు నాయుడుతో ఎందుకు జతకడతామని భాజపా నాయకులే చెబుతున్నారు. కృష్ణ, గోదావరి నదులకు వరదల వల్ల ఇసుక లభ్యతకు కొంత ఇబ్బంది ఏర్పడింది. త్వరలో సమస్యకు పూర్తి స్థాయిలో పరి ష్కరం లభిస్తుంద’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos