రెమ్‌డెసివిర్‌ తయారీ ఖర్చు రూ.100 అమ్మకం రూ.35 వేలు

రెమ్‌డెసివిర్‌ తయారీ ఖర్చు రూ.100 అమ్మకం రూ.35 వేలు

న్యూఢిల్లీ: కరోనా ను తగ్గించేందుకు అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ రూపొందించిన రెమ్డిసివిఆర్ యాంటి వైరల్ ఔషధం మంచి ఫలితాల్నిస్తోంది. దీని ఉత్పత్తిన మూడేళ్ల పాటు అమెరికానే కొనుగోలు చేసింది. దీంతో రెమ్డిసివిఆర్ను ఇతర దేశాలేమీ మూడేళ్ల పాటు కొనే వీల్లేదు. దీనిపై పేటెంట్ హక్కు గిలియడ్ సంస్థ అధిక రేట్లకు అమ్మి వినియోగదార్లను దోచుకుంటోంది. అమెరికాలో దీని తయారీకి అయ్యే ఖర్చు పది డాలర్లు (రూ.750). 3 వేల డాలర్లు(2.25 లక్షలు)కు అమ్ముతున్నారు. భారత్లోనూ దీని తయారీకి రెండు సంస్థలు గిలియడ్ సైన్సెస్ నుంచి అనుమతి పొందాయి. ఐదు రోజుల పాటుతీసుకునే మందుకు భారత్లో తయారీ ఖర్చు రూ. 100 రూపాయలు. రూ.35 వేలకు అమ్మబోతున్నారు. దరిమిలా ఇది సామన్యులకు అందుబాటులో ఉండదు. సామన్యులు ప్రాణాలు కోల్పొయే ప్రమాదముందఁ భారత కమ్యూఁస్టు పార్టీ(మార్క్సిస్ట్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దోపిడీనికి అడ్డుకునేందుకు భారత పేటెంట్ చట్టంలోని క్లాజ్ 92ను ఉపయోగించుకుని ఔషధం తయారీకి అనుమతిఁవ్వాలని డిమాండ్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos