ఎర్ర బావుటా నిగ నిగలు

ఎర్ర బావుటా నిగ నిగలు

అమరావతి : సరిగ్గా నూరేళ్ల కిందట ఇదే రోజున భారత కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. శత వసంతాల కమ్యూనిస్టు ఉద్యమం ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని పలు చోట్ల అరుణపతాకం రెపరెపలాడింది. వందేళ్ల కమ్యూనిస్టు పోరాటాలను తలపోసుకుంటూ నేతలంతా ఆయా చోట్ల ఎర్రజెండాలను ఆవిష్కరించారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను ప్రజలకు వివరించారు.ప్రకాశం : ప్రకాశంలోని పొదిలి, కొమరోలు, కనిగిరి, సింగరాయకొండ, చేవూరు, ఎర్రగొండపాలెం, జరుగుమల్లి మండలం మాడు గ్రామం, పామూరు, టంగుటూరు, జరుగుమల్లి మండలం చింతలపాలెం, తుమాడు, తదితర చోట్ల ఎర్రజెండాను వామపక్ష నేతలు ఎగువవేశారు. అక్టోబర్ విప్లవ స్ఫూర్తిని వివరించారు. కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, రెడ్డిగూడెం, చల్లపల్లి, పెనుగంచిప్రోలు, తదితర చోట్ల అరుణపతాకాన్ని నేతలు ఆవిష్కరించారు. వందేళ్ల కమ్యూనిస్టు పోరాట పటిమను కొనియాడారు. మంగళగిరి మండలం ఆత్మకూరు, తాడికొండ, పిడుగురాళ్ల, తదితర చోట్ల ఎర్రజెండాను ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు, చింతలపూడి మండలం పట్టాయిగూడెం, తదితర చోట్ల ఎర్రజెండా ఆవిష్కరణ చేశారు.కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి , శ్రీకాకుళం జిల్లా పాలకొండ సెంటర్, టెక్కలి రూరల్ గ్రామాలలో ఎర్రజెండా ఆవిష్కరణ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos