మూడు నెలలుగా 132 గ్రామాల్లో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదట..

మూడు నెలలుగా 132 గ్రామాల్లో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదట..

 అమ్మాయిలపై వివక్షతతో గ్రామీణ,గిరిజన ప్రాంతాల్లో భ్రూణహత్యలు నానాటికి పెరుగుతున్నాయని ఫలితంగా ఏడాదికేడాది దేశంలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న తరుణంలో తాజాగా వెలుగు చూసిన ఓ విషయం దేశం మొత్తాన్ని నివ్వెరపరుస్తోంది.ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని 132 గ్రామాల్లో మూడు నెలలుగా ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదంటూ వెలుగు చూసిన విషయం పలు అనుమానాలకు తావిస్తోంది.మూడు నెలలుగా 132 గ్రామాల్లో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టకపోవడంపై ప్రభుత్వ అధికారులు దృష్టి సారించారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భ్రూణ హత్యలు విపరీతంగా జరుగుతున్నాయని, దానివల్లనే ఆడ శిశువు గర్భంలో ఉందని తెలిస్తే గర్భంలోని ప్రాణం తీస్తున్నారని, అబార్షన్లు చేయిస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.గర్భం దాల్చిన వెంటనే.. అనధికారికంగా పుట్టేది అమ్మాయా? అబ్బాయా? అన్న విషయాన్ని తెలుసుకుంటున్న తల్లిదండ్రులు ఆడపిల్ల అయితే భ్రూణహత్యలు చేయిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ ఉదంతంపై లోతుగా దర్యాప్తు చేయాలని, భ్రూణ హత్యలను ఆపడానికి, ఆడపిల్లల జనన శాతాన్ని పెంచడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని కోరుతున్నారు. ఒక్క ఆడపిల్ల కూడా పుట్టకపోవటాన్ని తాము తీవ్రంగా పరిగణించామని దీనిపై సర్వే చేయిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆశిష్ సోహన్ ప్రకటించారు.ఇక అసలు విషయానికొస్తే సామాజిక చైతన్యం లోపించటం, ఆడపిల్లలైనా , మగపిల్లలయినా ఇద్దరూ సమానమనే భావన లేకపోవడం, గ్రామీణుల్లో అవగాహన కల్పించటంలో అధికారులు విఫలం కావటం కూడా ఈ దారుణ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఇక భ్రూణహత్యలు నేరమని చెప్తున్న చట్టాలున్నప్పటికీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అవి పాటించడంలేదని అందుకే అక్కడ 132 గ్రామాలలో మూడు నెలల్లో ఒక ఆడపిల్ల కూడా పుట్టలేదని తెలుస్తుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos