చక్రవడ్డీ మాఫీ

హైదరాబాదు : గత మార్చి నుంచి ఆగస్టు వరకు విధించిన మారటోరియం కాలానికి రుణ గ్రహీతలకు వడ్డీ పై వడ్డీ మాఫీని అమలు చేయాలని బ్యాంకులు, బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలను(ఎన్బీఎఫ్సీలు) ఆర్బీఐ కోరింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం కాలానికి సాధారణ వడ్డీ, వడ్డీ పై వడ్డీ మధ్య తేడా నగదును రుణ గ్రహీతల ఖాతాలో ప్రభుత్వం విధించిన గడువులోగా జమ చేయాలని సూచించింది. కోర్టు అదేశాల మేరకు ఈ నెల 23నగత ఆరు నెలల కాలానికి రూ.2 కోట్ల లోపు రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నవంబర్ 5లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని బ్యాంకులకు సూచించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos