ముంబై: నిబంధనలు ఉల్లంఘించిన రెండు బ్యాంకులు, రెండు ఫైనాన్స్ సంస్థలపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ప్రైవేట్ రంగ బ్యాంక్.. ఫెడరల్ బ్యాంక్ సహా మరో రెండు ఫైనాన్స్ సంస్థలపై భారీ జరిమానా విధించింది. వడ్డీరేట్లతోపాటు బ్యాంకుల్లో కస్టమర్ సర్వీసు నిబంధనలు పాటించడంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) విఫలమైంది. కేవైసీ నిబంధనల అమలును ఫెడరల్ బ్యాంక్ ఉల్లంఘించింది. మెర్సిడెజ్-బెంజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండియా సైతం కేవైసీ, ఎన్బీఎఫ్సీ నిబంధనలను కొసమట్టం ఫైనాన్స్ లిమిటెడ్ ఉల్లంఘించాయి. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) పై రూ.72 లక్షలు, ఫెడరల్ బ్యాంక్ మీద రూ.30 లక్షలు, మెర్సిడెజ్ బెంజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ మీద రూ.10 లక్షలు, కొసమట్టం ఫైనాన్సియల్ లిమిటెడ్ మీద రూ.13.38 లక్షల పెనాల్టీ విధించింది.