ఆర్‌బిఐ మార్గదర్శకాలపై కేరళ వ్యాజ్యం

తిరువనంత పురం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా మార్గదర్శకాలపై కేరళ ప్రభుత్వం అసంతృప్తితో రగిలిపోతోంది. ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీలు, కోఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ నియంత్రణ ఆదేశాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది. ఆర్బీఐ తాజా నియమావళి ప్రకారం కోఆపరేటివ్ సొసైటీలు కోఆపరేటివ్ బ్యాంక్ అనే పదాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. ఓటింగ్ హక్కు లేని సభ్యుల నుంచి సహకార సంఘాలు డిపాజిట్లు తీసుకోరాదు. ఈ మార్గ దర్శకాల వల్ల 1,625 ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీలు, వేలకొద్దీ ఇతర కోఆపరేటివ్ బ్యాంకుల నిర్వహణకు ఆటంకాలు ఎదురు కానున్నాయి. అందుకే ఆర్బీఐ గైడ్లైన్స్పై సుప్రీంను ఆశ్రయించాలని కేరళ ప్రభుత్వం అనుకుంటోందని కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్, అడ్వొకేట్ జనరల్తో చర్చలు జరుపుతున్నారు.సెప్టెంబర్లో పార్లమెంట్ జారీ చేసిన బ్యాంకింగ్ నియంత్రణ చట్టం సవరణ ప్రకారమే నూతన మార్గ దర్శకాల్ని అమలు చేస్తున్నామని ఆర్బీఐ తెలిపింది.ఈ చట్టం కేరళలో మాత్రమే పటిష్టంగా అమలు కావడం లేదని కేంద్రం భావిస్తోంది. దరిమిలా కేంద్రం ఆర్బీఐపై ఒత్తిడి చేస్తోంది. ఈ రెండు ఆదేశాలపై సుప్రీం కోర్టు ఊరట ఇచ్చినప్పటికీ రాజకీయ ఉద్దేశాలతోనే కేంద్రం ఇలా ప్రవర్తి స్తోందంటూ కేరళ సహకారన మంత్రి వీఎన్ వాసవన్ ఆరోపించారు. 60 శాతం కోఆపరేటివ్ సొసైటీల కార్యకలాపాలు సజావుగా సాగడం బహుశా కేంద్రానికి కంటగింపుగా మారిందని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos