టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ

టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ

హైదరాబాదు:టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తీవ్రంగా గాయపడ్డాడు. దర్శకుడు వంశీ కాంబనేషన్లో రూపొందిన యాక్షన్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగినట్టు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ట్రైన్ దోపిడీ సీన్లో ట్రైన్ మీది నుంచి లోపలికి దూకే షాట్లో రవితేజ అదుపుతప్పి కిందపడ్డారు. మోకాలికిపైన బాగా దెబ్బ తగలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేసి 12 కుట్లు వేసినట్టు అభిషేక్ అగర్వాల్ వివరించారు. ఆ షాట్లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారని, కాబట్టి షూటింగ్ను ఎక్కువ రోజులు వాయిదా వేస్తే నిర్మాత నష్టపోతాడని భావించిన రవితేజ రెండు రోజుల్లోనే మళ్లీ షూటింగ్కు రెడీ అయిపోయారట. విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా వినలేదన్నారు. విషయం తెలిసిన అభిమానులు రవితేజను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ కథానయికలుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీశర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos