కాంగ్రెస్‌తో పొత్తు తప్పు కాదు

కాంగ్రెస్‌తో  పొత్తు తప్పు కాదు

ముంబై: సైద్ధాంతిక వైరుధ్యమున్న రాజకీయ పక్షాలతో పొత్తు ఎలా పొసగుతుందని వచ్చిన విమర్శలకు శివసేన ఘాటుగా బదు లి చ్చింది. ‘ జమ్మూ- కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీతో భాజపా పొత్తుపెట్టుకోగా లేనిది, మేము కాంగ్రెస్ పార్టీతో కలిస్తే తప్పేంట’ని ఆ పార్టీ నేత సంజయ్ రావత్ ఎదురు ప్రశ్న వేసారు. మహా రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతి ష్టంభన నెలకొంది. రెండవ అతి పెద్ద పార్టీ శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ కోష్యారీ ఆహ్వానించారు. కాంగ్రెస్, ఎన్సీ పీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన కసరత్తు చేస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానా లుం డగా బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్నాయి. మిగతా 29 స్థానాల్లో ఇతర పార్టీలు, ఇండి పెండెంట్లు ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos