మళ్లీ తెరిచిన పూరీ జగన్నాథ రత్న భండార్.

మళ్లీ తెరిచిన పూరీ జగన్నాథ రత్న భండార్.

భువనేశ్వర్: ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుడి రత్న భండార్ని ఆదివారం తెరిచిన విషయం విదితమే. అయితే గురువారం మరోసారి ఆలయ అధికారులు రత్న భండార్ని తెరిచారు. ఇందులోని ఇంకా కొన్ని విలువైన వస్తువులను తరలించకపోవడంతో మళ్లీ తెరిచినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు బదిలీ చేయనున్నారు. ఉదయం 9:51 గంటలకు పర్యవేక్షక కమిటీ సభ్యులు గుడిలోకి వెళ్లారు. వస్తువులను తరలించడం, పర్యవేక్షించడానికి ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సభ్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు.వీరంతా ఉదయం 9 గంటలకు ఆలయంలోకి ప్రవేశించి పునరావాస ప్రక్రియను ప్రారంభించారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు పర్యవేక్షక కమిటీ చైర్మన్, ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ మీడియాతో మాట్లాడుతూ.. రత్నభాండార్ లోపలి గదిలో భద్రపరిచిన అన్ని విలువైన వస్తువులను తిరిగి తీసుకురావడానికి జగన్నాథుడి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. రహస్య గదిని తెరవడంతో అందులోని సంపదను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఆదివారం రహస్య గదిని తెరిచినా అప్పటికే సాయంత్రం కావడంతో సీల్ వేశారు. ఈ క్రమంలో ఆలయంలోకి భక్తులు ప్రవేశాన్ని నిలిపేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos