ముల్లంగి ధరలు పతనం

ముల్లంగి ధరలు పతనం

హోసూరు : ముల్లంగికి సరైన ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.హోసూరు ప్రాంతంలో బీట్రూట్, క్యారెట్, బీన్స్, టొమాటో, బంగాళాదుంపలు,ముల్లంగి తదితర కూరగాయలను పండించి తమిళనాడులోని వివిధ జిల్లాలకే కాక కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం హోసూరు ప్రాంతంలోని బాగలూరు, బేరికే, సూలగిరి తదితర ప్రాంతాలలోని రైతులు సుమారు 5 వందల ఎకరాలకు పైగా ముల్లంగి పంటను సాగుచేశారు. పంట బాగా పండినా, ప్రస్తుతం మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నెల రోజుల క్రితం కిలో ముల్లంగి హోసూరు మార్కెట్లో రూ.25 వరకు అమ్ముడుపోగా ఇప్పుడు రూ.5కు కొనేవారు కరువయ్యారు. ముల్లంగి ధరలు ఒక్కసారిగా పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట అమ్ముడు పోక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి పంట పెట్టామని, తీరా పంట చేతికొచ్చే సమయానికి ధరలు కుప్పకూలడంతో తీవ్రంగా నష్టపోయి ముల్లంగిని పొలాల్లో వదిలి వేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos