కపిల్‌ ట్రేడ్ మార్క్ క్రికెట్ షాట్‌లో రణ్‌వీర్‌ లుక్‌..

కపిల్‌ ట్రేడ్ మార్క్ క్రికెట్ షాట్‌లో రణ్‌వీర్‌ లుక్‌..

మాజీ సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలో దిగి ప్రపంచ క్రికెట్‌ను శాశిస్తున్న వెస్టిండీస్‌పై ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి భారత జట్టు ప్రపంచ కప్పును ముద్దాడిన 1983వ సంవత్సరం భారతీయులకు ఎప్పటికీ ప్రత్యేకమే.ఆ అసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై ’83’ పేరుతో కబీర్ ఖాన్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం రణ్‌వీర్‌ సింగ్ కపిల్‌దేవ్‌లా మేకోవర్ అయ్యారు.న శరీరాకృతిని ఓ క్రీడాకారుడిగా మార్చుకోవడానికి రణ్‌వీర్‌ పడ్డ కష్టం మనకు తెరపై కనపడుతుంది. ఫ్యాన్స్ కోసం కపిల్దేవ్లా ఉన్న రణ్‌వీర్‌ సింగ్ లుక్ను చిత్రీ యూనిట్ విడుదల చేసింది. అది కూడా కపిల్‌ ట్రేడ్ మార్క్ క్రికెట్ షాట్ నటరాజ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos