బంగార్రాజులో రమ్యకృష్ణ లుక్

బంగార్రాజులో రమ్యకృష్ణ లుక్

నాగార్జున నటించిన హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చిత్రం ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున , రమ్యకృష్ణ మరోసారి కలిసి నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్టును  నిర్మిస్తోంది. ఈ మూవీలో నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన నాగార్జున లుక్‌కు మంచి స్పందన రాగా.. బుధవారం రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సత్యభామగా ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగార్జున, రమ్యకృష్ణ సంప్రదాయ వస్త్రధారణలో నది ఒడ్డున డ్యాన్స్ చేస్తున్నారు. వారిద్దరూ చూడముచ్చటగా కనిపిస్తున్నారు. టైటిల్ పాత్రలో నాగార్జున నటిస్తుండగా రమ్యకృష్ణ అతని భార్య సత్యభామగా కనిపించనుంది. ఈ ఇద్దరితో పాటు, ఇతర ప్రముఖ తారాగణం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos