‘వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు’

‘వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు’

మౌంట్ అబు : ‘మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం. పోక్సో చట్టం కింద అత్యాచార కేసుల్లో ఉరి శిక్షపడిన దోషులకు క్షమాభిక్ష కోరే అర్హత లేదు. అలాంటి పిటిషన్లపై పార్లమెంట్ పునః సమీక్షించాల’ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. లైంగిక దాడులు, వేధింపుల బారి నుంచి బాలబాలికల్ని రక్షించేందుకు పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు. మహిళా భద్రత గురించి ఎన్నో చేశామని, ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల్లో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లి దండ్రిపైనా ఉందని చెప్పారు. సమాజంలో సమానత్వం, సామరస్యత. మహిళా సాధికారతతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos