‘కొవిడ్ టీకా ఓ ఫెయిల్యూర్’

‘కొవిడ్ టీకా ఓ ఫెయిల్యూర్’

హరిద్వార్ : కొవిడ్ వ్యాక్సిన్ను వైద్య శాస్త్ర వైఫల్యంగా బాబా రాందేవ్ అభివర్ణించారు. ఇక్కడ పతంజలి ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిం చారు. ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ బూస్టర్ డోసు వేసుకుంటే అది కాస్త మళ్లీ కరోనా వచ్చేందుకు కారణ మైంది. మేమే ప్రపంచానికి చక్ర వర్తులం. మా కంటే గొప్ప వారెవరూ లేరు అనుకోవడం తప్పు. ఇక పై ప్రపంచం మొత్తం మూలికా వైద్యం వైపు చూస్తుంద’న్నారు. ‘కోట్లాది మంది ప్రజలు తమ ఇంటి వెలుపల తులసి, కలబంద, తిప్ప మొక్కలను పెంచుతున్నారు. ఇవి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. తిప్ప మొక్కలపై పరిశోధనలు చేసి మందు లు తయారు చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos