రాజీవ్ గాంధీ హంతకుల విడుదలకు హై కోర్టు తిరస్కరణ

రాజీవ్ గాంధీ  హంతకుల విడుదలకు హై కోర్టు తిరస్కరణ

చెన్నై : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న దోషులు నళిని శ్రీహరన్, పి రవిచంద్రన్లను శిక్షా కాలం పూర్తి కాకుండా విడుదల చేసేం దుకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. సుప్రీం కోర్టుకు ఉన్నట్లుగా తనకు ప్రత్యేక అధికారాలు లేవని తెలిపింది. ఇదే కేసులో దోషి ఏజీ పెరారివలన్ను మే నెలలో సుప్రీంకోర్టు విడుదల చేసింది. నళిని , రవిచంద్రన్ దాఖలు చేసిన పిటిషన్లపై హై కోర్టు విచారణ జరిపింది. తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో గవర్నర్ విఫలమయ్యారని, గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరారు. గవర్నర్ ఆమోదం లేకుండానే తక్షణమే జైలు నుంచి తమను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ, జస్టిస్ ఎన్ మాల తో కూడిన ధర్మాసనం దీని పై స్పందించింది. స్తూ, భారత రాజ్యాంగంలోని అధికరణ 142 ప్రకారం సుప్రీంకోర్టు కు ఉన్న ప్రత్యేక అధికారాలు హై కోర్టుకు లేవని చెప్పింది. పెరారివలన్ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశించినట్లుగా తాము ఆదేశించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్కు విచారణార్హత లేదని తోసిపుచ్చింది. పెరారివలన్ విడుదల ప్రాతిపదికగా పిటిష న్లను దాఖలు చేసి ఉంటే, వారు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపింది. రాజీవ్ గాంధీ 1991లో తమిళనాడు, శ్రీపెరుంబుదూరులో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి బాంబర్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో మురుగన్ వురపు శ్రీహరన్, నళిని, ఏజీ పెరారివలన్, సంతాన్, జయకుమార్, రాబర్ట్ పయస్, పి రవిచంద్రన్ దోషులుగా కోర్టు తీర్పు చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos