బిగ్ బాస్ షోను నిషేధించాలి

బిగ్ బాస్ షోను నిషేధించాలి

హైదరాబాద్: బిగ్ బాస్ షోను నిషేధించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఈ షో ద్వారా ఆంధ్ర, తెలంగాణకు కొట్లాట పెట్టే కుట్ర జరుగుతోంది. బిగ్ బాస్ షోపై ముఖ్యమంత్రి, హోంమంత్రి దృష్టి సారించాలి. కుటుంబ సభ్యులతో కలసి షో చూడలేని పరిస్థితి ఉంది. సల్మాన్ ఖాన్ షోలో హిందువుల మనోభావాలను కించపరిచారు. వ్యాపారం ముసుగులో ప్రాంతీయ అసమానతలకు తెరతీస్తున్నారు. కమీషన్లు తీసుకుని అధికారులు షోలకు అనుమతి ఇస్తున్నార’ని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos