టీకాలు సరిగ్గా వేయక పోవటమూ దేశ ద్రోహమా?

టీకాలు సరిగ్గా వేయక పోవటమూ దేశ ద్రోహమా?

న్యూ ఢిల్లీ : ఇన్ఫోసిస్ను దేశద్రోహ శక్తులు అంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు చెందిన పాంచజన్య పత్రిక చేసిన వ్యాఖ్యలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘు రాం రాజన్ ఘాటు స్పందించారు. దేశంలో టీకాల్ని సరిగ్గా వేయలేక పోతున్న ప్రభుత్వాన్ని దేశద్రోహి అనగలరా అని ప్రశ్నించారు. బుధవారం వార్తా సంస్థ తో మాట్లాడారు. పాంచజన్య వ్యాఖ్యలు ఎందుకూ కొరగానివన్నారు. ‘జీఎస్టీ అమలు విధానం అద్భుతంగా ఉందని నేను అనుకోవడం లేదు. వాస్తవానికి దీన్ని మరింత బాగా తయారు చే యొ చ్చు. ఇప్పటికి జరిగిన తప్పుల నుంచి ప్రభుత్వం ఏమాత్రం నేర్చుకోవడం లేదు. తమ సొంత పక్ష పాతాలను వాడు కోవడానికి అది వేదిక కాకూడద’న్నారు. ఆర్థిక విధానాల్లో ప్రభుత్వం ఇంకా ఎంతో పురోగతి చెందాల్సి ఉందన్నారు.

తాజా సమాచారం