రాగి రైతులకు వర్షం తెచ్చిన కష్టం

హొసూరు : వర్షాధారిత పంటగా ఈ ప్రాంతంలో సాగవుతున్న రాగి పంట వర్షాల కారణంగా దెబ్బ తింటోంది. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవడంతో రాగి పంట బాగా పండింది. హొసూరు ప్రాంతంలో సుమారు 40 వేల హెక్టార్లలో రాగి పంటను పండించారు. ప్రస్తుతం కోత దశకు వచ్చింది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండగా, పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధాన పంట చేతికందకుండా పోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా కాపాడుకొచ్చిన పంట కోత దశలో వర్షాల వల్ల దెబ్బ తింటోందని, దీనివల్ల తమ జీవనాధారం కోల్పోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు .

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos