హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలోనే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.