రైలు టికెట్‌ సొమ్ము వాపస్‌కు 3 రోజులు గడువు

రైలు టికెట్‌ సొమ్ము వాపస్‌కు 3 రోజులు గడువు

హైదరాబాదు:వివిధ సందర్భాల్లో రద్దయిన రైళ్లకు సంబంధించిన ప్రయాణికులు తమ టికెట్‌ సొమ్మును మూడు రోజుల్లోగా వాపసు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రిజర్వేషన్‌ కౌంటర్లలో టికెట్‌ తీసుకున్నవారు సొమ్ము వాపసు కోసం తమ టికెట్‌ను రిజిర్వేషన్‌ కౌంటర్‌లో అందజేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ ద్వారా తీసుకున్న ఇ-టికెట్లు అయితే వాటంతటవే రద్దవుతాయని, ఎలాంటి క్యాన్సిలేషన్‌ చార్జీలు మినహాయింపు లేకుండా మొత్తం సొమ్ము ప్రయాణికుల బ్యాంకు ఖాతాకు జమవుతుందని తెలిపారు. భారీ వర్షాలు, వరదలు, బంద్‌లు, రైల్‌ రోకో వంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తినపుడు అనివార్యంగా రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం జరుగుతుందని తెలిపారు. కాగా, ఇటీవల సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివఅద్ధి పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయ డం, మరికొన్నింటిని దారిమళ్లించాల్సి వచ్చిందని సీపీఆర్‌వో శ్రీధర్‌ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos