ఆగిన 50 రైళ్ళు

ఆగిన 50 రైళ్ళు

న్యూ ఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన సంయుక్త్ కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుతో సోమవారం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ‘రైల్ రోకో’ ఉత్తర భారతంపైనే ఎక్కువ ప్రభావాన్ని చూపింది. సుమారు 50కి పైగా రైళ్లు నిలిచిపోయాయి. దాదాపు 100కు పైగా స్టేషన్లపై నిరసన ప్రభావం కనిపించింది. అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో పలువురు రైతులు సహా 8 మంది మరణాలకు కారణమై య్యారంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తొలగింపు డిమాండ్తో రైల్ రోకోకు పిలుపునిచ్చింది. ఆ మారణకాండలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు రైల్వే పోలీస్ సిబ్బంది ఆయా స్టేషన్లు, ట్రాక్స్ వద్ద గస్తీ చేస్తున్నారు. పంజాబ్లో నిరసనకారులు తెల్లవారు జామున 5.15 గంటల నుంచే ఫిరోజ్పూర్ రైల్వే డివిజన్ వద్ద నాలుగు సెక్షన్లు బ్లాక్ చేసారు. అమృత్సర్ రైల్వే స్టేషన్ పట్టాలపై బైఠాయించారు. హర్యానాలోనూ రైతులు బహదూర్గఢ్ వద్ద రైల్వే ట్రాక్పై బైఠాయించారు. సోనిపట్ రైల్వే స్టేషన్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దింపారు. మరోవైపు, ఉత్తరప్రదశ్ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ఆందోళనల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిచిన వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos