ఆ చట్టాలు రైతుల పాలిట శాపాలు

ఆ చట్టాలు రైతుల పాలిట శాపాలు

న్యూఢిల్లీ: వ్యవసాయ నూతన చట్టాలు రైతుల పాలిట నల్ల చట్టాలుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. మంగళవారం ఆయన కిసాన్ కి బాత్’ పేరిట పంజాబ్, హరియాణా, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన పది మంది రైతులతో వర్చువల్ సంభాషణ జరిపారు. ‘ఈ చట్టాల వల్ల రైతులు దోపిడీకి గురవుతారు. ఇవి నల్ల చట్టాలు. రైతులకు విపరీతంగా హాని కలిగిస్తుంద’ని వివరించారు. రైతులూ తమ అభిప్రాయాల్ని తెలిపారు. ‘ఈ చట్టాలు పూర్తిగా నల్ల చట్టాలు. వీటి వల్ల రైతులు దోపిడీకి గురవుతారు. ఆత్మహత్యలు పెరుగుతాయి’ అని బిహార్కు చెందిన ధీరేంద్ర కుమార్ తెలిపారు. కనీస మద్దతు ధర గురించి రైతులు ఎందుకు భయపడుతున్నారని రాహుల్ ప్రశ్నించినపుడు దాన్ని పాలకులు పూర్తిగా ఉపసంహరించుకుని రైతులను మోసం చేస్తారాని వారు ఆందోళన వ్యక్తం చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos