అబద్ధానికి చిరునామా మోదీ

అబద్ధానికి చిరునామా మోదీ

పాట్నా : అబద్ధాలు ఆడటం ప్రధాని మోదీకి అలవాటుగా మారిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. శుక్రవారం బీహారులోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పలు ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ‘చైనా జవాన్ల చొరబాటును వ్యతిరేకిస్తూ మన జవాన్లు ధీరోదాత్తంగా పోరాడారు. ప్రాణాలూ కూడా కోల్పోయారు. అయితే మన ప్రధాని మోదీ మాత్రం మన భారత భూభాగంలోకి చైనా దళాలు చొరబడలేదని వ్యాఖ్యానించి జవాన్లను అవమానించారు. చైనా దళాలు మన భారత భూభాగంలోంచి ఎప్పుడు నిష్క్రమిస్తాయో ప్రధాని చెప్పాల’ని డిమాండ్ చేశారు. ‘కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులపై దాడికి దిగింది. వీటి వల్ల బిహార్లోని మార్కెట్ యార్డులు, కనీస మద్దతు ధర తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు దేశం మొత్తం ఆ చట్టాలను అమలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఒక్కరికీ ఉద్యోగం లభించలేదు. ఈ విషయంలో మోదీ బిహారీలకు అబద్ధాలు చెబుతు న్నారు. బిహారీలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. మోదీ ఎక్కడికి వెళ్లినా అబద్ధాలే చెబుతారు. రైతులకు, జవాన్లకు, కార్మికులకు శిరస్సు వంచి నమ స్కారాలు చేస్తున్నానంటూ బిహార్లో ప్రకటిస్తార. ఢిల్లీకి వెళ్లగానే అదానీ, అంబానీల కోసమే పని చేస్తార’ని ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos