సబ్ కా వినాశ్ మాత్రమే కొనసాగుతోంది

సబ్ కా వినాశ్ మాత్రమే కొనసాగుతోంది

న్యూ ఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోయినందుకు పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా సబ్ కా వికాస్ అనేది ఎక్కడా లేదు. సబ్ కా వినాశ్ మాత్రమే కొనసాగుతోంది. దేశంలో కేవలం పెట్రో ఉత్పత్తుల ధరల్లోనే అభివృద్ధి కనిపిస్తోంద’ని ట్వీట్ చేశారు. ప్రజల నుంచి ప్రభుత్వం బలవంతంగా పన్నులు లాక్కుంటోందని ఆరోపించారు. పన్నుల బెడద లేకపోతే ఇండియాలో లీటర్ పెట్రోల్ రూ.66కు, డీజిల్ రూ.55కే లభిస్తుందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని రాహుల్ గాంధీ ట్వీట్కు జతచేశారు.

‘కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా పెంచుకుంటూ పోతోందని, ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు కష్టాల పాలవుతున్నార’ని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ కూడా ట్వీట్ చేశారు. కేంద్రం ఎరువుల ధరలను సైతం భారీగా పెంచిందని ఆక్రోశించారు. బీజేపీ పాలనలో ధరల మంటతో రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతుండగా, ప్రధాని మోదీ మిత్రులు మాత్రం నానాటికీ ధనవంతులవుతున్నార’ని నిప్పులు చెరిగారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos