రాహుల్‌ గాంధీ పునరాగమనం

రాహుల్‌ గాంధీ పునరాగమనం

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ పగ్గాల్ని చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం దీనికి వేదిక కానుంది. ‘…సాధ్యమైనంత త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నాం. వేదిక, తేదీలు ఖరారు కాగానే మీకు సమాచారం అందజేస్తాం’ అని దేశంలోని అన్ని పార్టీ శాఖలకు ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బృంద సారథి మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎంపికకు వచ్చే డిసెంబర్ లేక జనవరిలో జాతీయ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. పార్టీ ప్రస్తుత పరిస్థితులను పరిగణిస్తే రాహుల్ గాంధీ పునరాగమనం తథ్యమని తెలుస్తోంది. పీ. చిదంబరం, కపిల్ సిబాల్, వివేక్ తన్ఖా తదితరులు పార్టీ పదవికి పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నాయకత్వంలోని మహా కూటమి విజయావకాశాలు కాస్త కాంగ్రెస్ వల్ల దెబ్బతిన్నాయన్న అపఖ్యాతి వచ్చింది. పార్టీ నుంచి ముస్లిం ఓట్లను ఏఐఎంఐఎం తన్నుకు పోయిందంటూ ఆ పార్టీ మీద విమర్శలు సంధించింది. పార్టీ బలంగా ఉన్న మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లోనూ పరాజయాన్ని మూటగట్టు కుంది. పార్టీ పని తీరును 23 మంది నాయకులు బాహటంగానే విమర్శించారు. పార్టీకి పూర్తి స్థాయి నాయకుడు అవసరమ న్నారు. పీ. చిదంబరం, కపిల్ సిబాల్, వివేక్ తన్ఖా తదితరులు పార్టీ పదవికి పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos