న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పాల్గొనాల్సిన ఎన్నికల ప్రచార సభను చేశారు. షెడ్యూల్ ప్రకారం గురువారం ముస్తఫాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ నిర్వహించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షులు దేవేందర్ యాదవ్ తెలిపారు. అయితే శుక్రవారం మాదిపూర్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచారసభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు.