న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తగా ప్రకటించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. నష్టపరిహారాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అందరూ ఐక్యంగా సాయం అందించేందుకు ముందుకు వచ్చారని అన్నారు. కొండచరియలు విరిగిపడటంతో కీలకమైన రోడ్లు తెగిపోయాయి. సహాయక బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకోవడం అసాధ్యం. ఇది పెను విషాదమని అన్నారు. మౌలికసదుపాయాలు, బాధితులకు సాయం అందించేందుకు వయనాడ్కు సమగ్ర పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని అన్నారు.