మోదీ ఓ అసత్యాగ్రహి

మోదీ ఓ అసత్యాగ్రహి

న్యూ ఢిల్లీ:కేంద్రంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శల బాణాలు కొనసాగుతున్నాయి. తాజాగా సౌర్ విద్యుత్ ప్రాజెక్టు విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రాహుల్. మధ్యప్రదేశ్లోని రేవా సోలార్ పార్క్.. ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ ప్రాజెక్ట్ అని మోదీ అన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. “అసత్యాగ్రహి” అని హిందీలో ట్వీట్ చేశారు. సత్యం కోసం జరుగుతున్న పోరాటాన్ని విశ్వసించని వారిని అసత్యాగ్రహి అంటారు. మధ్యప్రదేశ్ రేవాలోని సౌర విద్యుత్ ప్రాజెక్టే.. ఆసియాలో అతిపెద్దదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది. కర్ణాటకలో పావగడ పార్కు కన్నా.. రేవా పార్కు ఉత్పత్తి సామర్థ్యం తక్కువని గుర్తుచేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos