మాటలు స్వదేశీ, చేతలు విదేశీ

మాటలు స్వదేశీ, చేతలు విదేశీ

న్యూ ఢిల్లీ: భారత్ లో తయారీ విషయంలో కేంద్రం మాటలు, చేతలకు పొంతన లేదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మంగళ వారం చేసిన ట్వీట్లో ప్రధాని మోదీని ఎద్దేవా చేసారు. ‘వాస్తవాలు అబద్ధమాడవు. భాజపా మేక్ ఇన్ ఇండియా అని చెబుతోంది. కానీ చైనా నుంచి దిగుమతి చేస్తోంది’ అని విమర్శించారు. చైనా నుంచి యూపీఏ హయాంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో దిగుమతి చేసుకున్న వస్తువులను పోలుస్తూ ఒక రేఖా చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు రాహుల్. ప్రస్తుత ఎన్డీఏ కాలంలో చైనా నుంచి దిగుమతులు పెరిగింది. మేక్ ఇన్ ఇండియా ఓ విఫల కార్యక్రమమని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos