న్యూఢిల్లీ: భారతీయ ఆయుధ కంపెనీలు తయారు చేసే ఆర్టిల్లరీ షెల్స్ .. యురోపియన్ కస్టమర్ల నుంచి ఉక్రెయిన్‌కు తరలివెళ్తున్నట్లు ఓ రిపోర్టు రిలీజైంది. అయితే ఆ వాణిజ్యాన్ని భారత్ అడ్డుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. యురోప్ మీదుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు రష్యా పేర్కొన్నది. భారత, యురోప్ ప్రభుత్వ ర, రక్షణ అధికారులు ఈ విషయాన్ని ద్రువీకరించారు. ఏడాది కాలం నుంచి ఉక్రెయిన్‌కు భారత తయారీ షెల్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు సందర్భాల్లో రష్యా అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లవ్రోవ్‌తో జరిగిన భేటీ సమయంలో ఈ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌కు చెందిన మందుగుండు సామాగ్రి ఉక్రెయిన్‌కు చేరుకున్న అంశంపై ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ ద్రువీకరిస్తూ కథనాన్ని రాసింది. రష్యా, భారత్‌కు చెందిన రక్షణ, విదేశాంగ మంత్రులు ఇంకా ఈ అంశంపై స్పందించలేదు. ఉక్రెయిన్‌కు ఎటువంటి ఘన ఆర్టిల్లరీ షెల్స్‌ను అమ్మలేదని జనవరిలో విదేశాంగ శాఖ ప్రతిని రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు.