మోదీకి పూరీ లేఖ..

మోదీకి పూరీ లేఖ..

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశాడు.లేఖ అంటే సినిమాకి సంబధించిన లేఖ కాదు ప్లాస్టిక్ నిషేధం వల్ల చోటు చేసుకునే పరిణామాల గురించి వివరిస్తూ లేఖ రాశాడు. వాతావరణంలో విపరీతమైన మార్పులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక్కటే కారణం కాదని, అనేక ఇతర అంశాలు కూడా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నాడు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తే పర్యావరణంలో ఒక్కసారిగా మార్పు రాదని తెలిపారు.పైగా ప్లాస్టిక్ నిషేధం వల్ల అందరూ పేపర్ కవర్లు, పేపర్ సంచులను వాడడం మొదలుపెడతారని, దాంతో పేపర్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయి చెట్లను ఎక్కువగా నరికే పరిస్థితి తలెత్తుతుందని వివరించాడు. చెట్ల నరికివేతతో పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు.ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే మొక్కలు ఎక్కువగా నాటాలని, ఒక్కసారి వాడిన ప్లాస్టిక్ ను పదేపదే వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ప్లాస్టిక్ ను ఎక్కడపడితే అక్కడ పడవేయడం తగ్గుతుందని పూరీ జగన్నాథ్ తన లేఖలో తెలిపారు.దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించాడు.

తాజా సమాచారం