పంజాబ్ ముఖ్యమంత్రి రాజీనామా

పంజాబ్ ముఖ్యమంత్రి రాజీనామా

చండీఘడ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. కొద్ది నిముషాల్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగనున్న తరుణంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడుగా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వారి మధ్య విభేదాలు నెలకొన్న సంగతి సంగతి తెలిసిందే. మరో అయిదు నెలల్లో పంజాబ్ శాసన సభ ఎన్నికలు జరగాల్సి ఉంది.

ప్రత్యామ్నాలున్నాయి..

రాజ్‌భవన్‌కు చేరుకుని అమరీందర్‌ సింగ్‌ గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజీనామా సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టారు. ఇది నాకు అవమానకరంగా అనిపించింది. ప్రభుత్వాన్ని నడపలేనని అనుకున్నట్లున్నారు. ఎవరి మీద నమ్మకముంటే వారిని సీఎం చేసుకోమని చెప్పా’అని తెలిపారు.
అయితే తన భవిష్యత్‌ కార్యాచరణపై కొన్ని సంకేతాలు ఇచ్చారు. ‘రాజకీయ భవిష్యత్‌ గురించి నాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయాలు వినియోగిస్తా. నా వెంట ఉన్నవారితో మాట్లాడి భవిష్యత్‌పై నిర్ణయం’ అని అమరీందర్‌ సింగ్‌ చెప్పారు. ఈ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌లో వివాదం మరింత ముదిరింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌ నవజోత్‌ సింగ్ సిద్ధూతో విభేదాలు తారస్థాయికి చేరాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అమరీందర్ సింగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos