పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక

పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక

కాంగ్రెస్ నిరసనల్లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తంగా మారాయి. దిల్లీలో పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీలను విజయ్ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీ రేట్ల పెంపు అంశాలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా అనేక మంది నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తడమే తమ కర్తవ్యమని ఈ విధులు నిర్వర్తించినందుకు తమ ఎంపీలను అదుపులోకి తీసుకుంటాన్నరని రాహుల్ విమర్శిం చారు. అంతకుముందు రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు పార్లమెంట్లో నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీలను.. విజయ్ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహ కాంగ్రెస్ కార్యకర్తలు వర్షంలోను నిరసనలను కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos