‘సంగీత్’ నిషేధం

‘సంగీత్’ నిషేధం

భోపాల్: వివాహ వేడుకల కోసం పెళ్లికి ముందే కాబోయే భార్య భర్తల ఛాయా చిత్రీ కరణ, సంగీత్ కార్యక్రమాల కోసం మహి ళలకు మగ డాన్సర్స్ తో శిక్షణ ఇప్పించడాన్ని మధ్య ప్రదేశ్ జైన్, గుజరాతీ సంస్థలు నిషేధించాయి. ఇక్కడి గుజరాత్ సేవా సమాజ్ ప్రధాన కార్యదర్శి సంజయ్ పటేల్ మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ఆ రెండు పనులూ తమ సంస్కృ తి, సంప్ర దా యాలకు విరుద్ధమని ఆధ్యాత్మిక ప్రముఖులు తెలిపినందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పటేల్ పేర్కొన్నారు. దీన్ని జైన్, గుజరాతీ సామాజిక వర్గీయులు స్వాగతిం చినట్లు చెప్పారు. తమ ఆదేశాలను ఖాతరు చేయని వారిని సంఘం నుం చి బహిష్కరిస్తామని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos