ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

విజయవాడ: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 73,227 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కాల్వల ద్వారా 13,477 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. సాయంత్రం లేదా రాత్రికి లక్షన్నర క్యూసెక్కులకు చేరుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos