అమరావతి : ఎట్టిపరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచమని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఛార్జీలను పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. కావాలనే కొందరు యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలని మండిపడ్డారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.