పవర్‌ స్టార్‌ పోస్టర్‌

పవర్‌ స్టార్‌ పోస్టర్‌

హైదరాబాదు: రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న తాజా సినిమా-పవర్ స్టార్ పోస్టర్ గురువారం విడుదలైంది. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్బీ, టీఎస్, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. ఈ సినిమా త్వరలోనే ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో విడుదల కానుంది. జై పవర్ స్టార్’ అని పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాతి కథ అని దానిపై రాసారు. పోస్టర్లో పవర్ స్టార్ పాత్రధారి అచ్చం జనసేన అధినేత పవన్ కల్యాణ్లా పోజు ఇచ్చాడు. నలుపు రంగు టీ షర్ట్ వేసుకుని కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. కాగా, తాను తీస్తోన్న పవర్ స్టార్ సినిమా ఏ వ్యక్తికో చెందిన బయోపిక్ కాదని వర్మ ఇప్పటికే స్పష్టీకరించారు. పార్టీ ప్రారంభించి, ఎన్నికల్లో ఓడిన ఓ సినీ నటుడికి ఎదురైన పరిణామాల గురించి కల్పిత కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందన్నారు. ఈ సినిమా కథ, పాత్రధారి ఏ వ్యక్తినయి పోలి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనని ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos