కోళ్ల వ్యర్థాలతో చేపల పెంపకం

హొసూరు : ఈ ప్రాంతంలో పలు చోట్ల కోళ్ల వ్యర్థాలతో చేపలనుపెంచుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలవలపల్లి డ్యాం సమీపంలోని తట్టిగాణపల్లి, సూలగిరి సమీపంలోని కామన్ దొడ్డి, గోపసంద్రం తదితర ప్రాంతాల్లో కోళ్ల వ్యర్థాలతో బెంగళూరుకు చెందిన కొందరు చేపల పెంపకం సాగిస్తున్నారు. ఈ చేపలను హొసూరుతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. కోళ్ల వ్యర్థాలతో పెంచిన చేపలను ఆరగిస్తే రోగాల పావడం ఖాయం. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ చేపలను

తిని ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా చేపకల పెంపకందార్లపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos