పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు

పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు

అమరావతి: సీనియర్ నటుడు, వైఎస్ఆర్‌సీపీ నాయ‌కుడు, మాజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు న‌మోదు అయ్యింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై ఈ నెల 9న కేసు న‌మోదు అయిన‌ట్లు స‌మాచారం. బీఎన్ఎస్ 2003 యాక్ట్ ప్ర‌కారం.. 111, 196, 353, 299, 341, 336 (3) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు పోలీసులు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos