పోలీసుల వైఫల్యం..భిక్షాటనకు ఊతం

పోలీసుల వైఫల్యం..భిక్షాటనకు ఊతం

ప్రజావాహిని – బెంగళూరు

నిస్సహాయులచే బలవంతంగా యాచన చేయించే ముఠా ఆట కట్టించటంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారని శాసన సభ మహిళ, పిల్లల సంక్షేమ సమితి విమర్శించింది. సమితి అధ్యయన నివేదికను అధ్యక్షులు పూర్ణిమ బుధ వారం  విధాన సభకు సమర్పించారు. ‘భిక్షాటన చేయిస్తున్న వ్యక్తులు సంస్థల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘ విద్రోహక శక్తుల్ని గుర్తించి వారికి వ్యతిరేకంగా తీసుకున్న చట్ట ప్రకార చర్యల్ని ప్రతి నెలా సమితికి నివేదించాల’ని సఫార్సు చేసింది.ఇంకా భిక్షాటన చేస్తున్నవారిని బంధించి, యాచనకు దూరమయ్యేలా వారి మనస్సు మార్చేందుకు పాటు పడాలని సూచించింది. యాచకుల్ని గుర్తించ సాయ పడుతున్న అధికార్లు భిక్షకుల సంఖ్యను తగ్గించేందుకు ఏమాత్రం కృషి చేయటం లేదని విమర్శించింది. భిక్షకుల్ని గుర్తింపు, వారి పునరాసాల్లో అధికార యంత్రాంగంలో సమన్వయం కొరవడిందని సమితి తప్పు బట్టింది. 2019-20లో మొత్తం 719 మంది  బాల భిక్షకుల్ని  బంధించారు. వారిలో 617 మందిని వారి తల్లి దండ్రులకు అప్పగించారు. మిగిలిన వారిని బాలమందిరాలకు తరలించినట్లు అధికార్లు సమితికి వివరించారు. యాచన చేస్తున్న బాలికల పట్ల చాలా సంఘ విద్రోహక శక్తులు చాలా ఘోరంగా ప్రవర్తిస్తునారని సమితి ఆక్రోశించింది. రాష్ట్రంలో 2015 నుంచి 2020  వరకూ 42,427 మంది మగు వలు కనిపించకుండా పోయారు. వీరిలో 38, 824  మందిని పట్టుకున్నారు. కుటుంబ కారణాల వల్ల మహిళలు పారి పోతున్నారని పోలీసులు ఇచ్చిన వివరణ, సంబంధిత గణాంకాల పట్ల సమితి పెదవి విరిచింది. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె వసూలు చేసిన బిక్షకుల సెస్‌ బాకీ రూ.118 కోట్లు త్వరగా చెల్లించాలని సమితి ఆదేశించింది. ప్రజల నుంచి వసూలు చేసిన సెస్‌ను భిక్షకుల సంక్షేమానికి మళ్లించనందకు ఆక్షేపించింది. ఆ మొత్తాలను ఇతర పనులకు మళ్లించరాదనీ సూచించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos