ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో పత్తిపాటి, నారాయణ

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో పత్తిపాటి, నారాయణ

అమరావతి: రాజధాని భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారనే ఆరోపణపై మాజీ మంత్రులు పొంగూరు నారా య ణ, పత్తిపాటి పుల్లారావు, తెదేపా నేత, వెంకటాయపాలెం మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరసింహాకు వ్యతిరేకంగా కేసులు దాఖలు చేసినట్లు సీఐడీ పోలీసు సూపరెంటెండెంట్ మేరీ ప్రశాంతి గురువారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. మభ్యపెట్టి తన 99 సెంట్ల భూమిని కొన్నారని వెంకటాయ పాలేనికి చెందిన పోతురాజు బుజ్జి అనే దళిత మహిళ మహిళ చేసిన ఫిర్యాదు ప్రకారం వారికి వ్యతిరేకంగా సెక్షన్ 420, 506,120(బి) కేసులను నమోదు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. విచారణ లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు మొత్తం రూ. 220 కోట్ల విలువైన భూములను కొన్నారు. అమరావతిలో 129 ఎకరాల భూమిని 131 మంది, పెద్దకాకానిలో 40 ఎకరాల భూమి 43 మంది, తాడి కొండలో120 ఎకరాలను 188 మంది, తుళ్లూరులో 133 ఎకరాల భూమిని 148 మంది , మంగళగిరిలో 133 ఎకరాలను 148 మం ది, తాడేపల్లిలో 24 ఎకరాల భూమిని, 49 మంది కొన్నారని మేరీ ప్రశాంతి వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos